Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

కంటోన్మెంట్‌ అధికారులపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

కంటోన్మెంట్‌ అధికారులపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్‌ కంటోన్మెంట్‌ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తామని తేల్చి చెప్పారు ఈ విషయమై కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘కంటోన్మెంట్‌ ఏరియాలో నాలాలపై చెక్‌డ్యామ్‌లు కట్టడం వల్ల కాలనీలు మునిగిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా అక్కడి అధికారులు తీరు మార్చుకోవడం లేదు. ఇకపై చూస్తూ ఊరుకోం.. ప్రజల కోసం తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వస్తే కంటోన్మెంట్‌కు నీళ్లు, కరెంటు కట్‌ చేస్తామ’ని కేటీఆర్‌ హెచ్చరించారు. ఇక అధికారులతో ఆఖరిసారి చర్చలు జరపాలనీ.. వినకపోతే నీళ్లు, కరెంట్‌ కట్‌ చేయాలనీ.. అసెంబ్లీలోనే ఉన్న స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీకి ఆదేశాలిచ్చారు మంత్రి కేటీఆర్‌.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img