Friday, June 9, 2023
Friday, June 9, 2023

క‌రీంన‌గ‌ర్‌లో ఈసీఎల్ఏటీ హెల్త్‌కేర్ సెంట‌ర్: మంత్రి కేటీఆర్‌

హెల్త్‌కేర్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ఉన్న 3ఎం హెల్త్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్స్‌(హెచ్ఐఎస్), ఈసీఎల్ఏటీ హెల్త్ సొలూష‌న్స్ సంయుక్తంగా తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్‌లో కొత్త సెంట‌ర్‌ను ఏర్పాటు చేయ‌నున్నాయి. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వాషింగ్ట‌న్ డీసీలో జ‌రిగిన స‌మావేశంలో 3ఎం, ఈసీఎల్ఏటీ అధికారుల‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ సర్కార్‌తో ఆ సంస్థ‌లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. క‌రీంన‌గ‌ర్ కేంద్రంలో ఆ సెంట‌ర్‌ మెడిక‌ల్ కోడింగ్‌, క్లినిక‌ల్ డాక్యుమెంటేష‌న్ సేవ‌ల్ని అందించ‌నున్న‌ది. క‌రీంన‌గ‌ర్‌లో ఏర్పాటు చేయ‌నున్న ఈసీఎల్ఏటీ ఆపరేష‌న్స్ సెంట‌ర్‌లో వంద మందికి ఉద్యోగం క‌ల్పించ‌నున్నారు. ఆ త‌ర్వాత ఆ సెంట‌ర్‌లో ఉద్యోగుల సంఖ్య‌ను 200కు పెంచ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఈసీఎల్ఏటీ హెల్త్‌కేర్ సంస్థ‌తో కుదిరిన ఒప్పందం గురించి మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. దాదాపు 40 ఏళ్ల నుంచి 3ఎం హెచ్ఐఎస్ హెల్త్‌కేర్ రంగంలో సేవ‌లు అందిస్తోంది. ఆ సంస్థ అత్యాధునిక హెల్త్‌కేర్ వ్య‌వ‌స్థ‌ను డెవ‌ల‌ప్ చేసింది. దాదాపు 18 దేశాల్లో ఆ సంస్థ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. త‌క్కువ ఖ‌ర్చుతో నాణ్య‌మైన వైద్యాన్ని అందిచ‌డ‌మే ల‌క్ష్యంగా ఆ సంస్థ సేవ‌లు అందిస్తోంది. తెలంగాణ ప్ర‌భుత్వం, 3ఎంతో పాటు ఈసీఎల్ఏటీ మ‌ధ్య స‌హ‌కారం గురించి స‌మావేశంలో విస్తృతంగా చ‌ర్చించారు. క‌రీంన‌గ‌ర్ సెంట‌ర్ ద్వారా మెడిక‌ల్ కోడింగ్‌, సంబంధిత టెక్నాల‌జీ సేవ‌ల గురించి ప‌నిచేయ‌నున్న‌ట్లు ఈసీఎల్ఏటీ హెల్త్ సొల్యూష‌న్స్ వ్య‌వ‌స్థాప‌కుడు, గ్రూపు సీఈవో కార్తీక్ తెలిపారు. 3ఎంతో భాగ‌స్వామ్యం ఏర్ప‌డ‌డం సంతోష‌క‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ విజ‌న్ త‌మ‌ను ఆక‌ర్షిస్తున్న‌ట్లు 3ఎం హెచ్ఐఎస్ ఎండీ సందీప్ వాద్వా తెలిపారు. ఈ ఒప్పందంతో తెలంగాణ‌లో లైఫ్‌సైన్సెస్‌, హెల్త్‌కేర్‌ను ప్ర‌మోట్ చేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img