Friday, March 24, 2023
Friday, March 24, 2023

కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండండి: హరీశ్ రావు

కరోనా విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అయితే అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలను అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. కోవిడ్ మరోసారి విజృంభిస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో ఆయన వైద్య అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంలో అలసత్వం వహించవద్దని… అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. అన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీలలో వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. తెలంగాణకు మరిన్ని డోసుల వ్యాక్సిన్ ను పంపించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని ఈ సందర్భంగా హరీశ్ రావు నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img