ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ అందించడం సంతోషంగా ఉందన్నారు. కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్ ముప్పు అలాగే ఉందన్నారు. చైనా, అమెరికా, హాంకాంగ్‌లో కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. కరోనా కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని సూచించారు. కొత్త వ్యాక్సిన్ కోసం ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తోందని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు.