Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

కరోనా వ్యాక్సిన్‌ రెండో డోసు తప్పనిసరిగా వేయించుకోవాలి

: మంత్రి హరీశ్‌రావు
కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్న వారంతా తప్పనిసరిగా రెండో డోస్‌ వేయించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం క్షీరసాగర్‌ గ్రామంలో గురువారం ఉదయం కొన్యాల బాల్‌ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి జ్ఞాపకార్థం కేబీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత మినరల్‌ అండ్‌ కూల్‌ వాటర్‌ ప్లాంట్‌ను మంత్రి హరీశ్‌ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ్‌ గ్రామస్తులకు సొంత నిధులతో ఉచిత మినరల్‌ వాటర్‌ అందించాలనే లక్ష్యంతో ఏంపీటీసీ కొన్యాల బాల్‌రెడ్డి వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా కరోనా వ్యాక్సిన్‌ రెండో డోస్‌ వేసుకున్నారా..అంటూ ఆరా తీశారు.తప్పనిసరి వేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img