మంత్రి హరీష్‌రావు
కరోనా వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి సంశయాలు అవసరం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. . సోమవారం రాష్ట్రంలో బూస్టర్ డోస్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందని చెప్పారు. మొదటి డోసు విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి చాలా సహకారం అందించారన్నారు. 15`18 ఏళ్ల మధ్య వారిలో వారం వ్యవధిలో 38 శాతం మందికి మొదటి డోసు వ్యాక్సిన్ పూర్తయిందని మంత్రి చెప్పారు. . టీకా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వేగంగా పూర్తి చేసేందుకు యత్నిస్తున్నామని అన్నారు. అందరూ బూస్టర్ డోస్ వేసుకోవాలని సూచించారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా బూస్టర్ డోస్ వేసుకుంటున్నారని తెలిపారు. హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60ఏళ్లు పైబడిన వారు డోస్ వేసుకోవాలని అన్నారు. ప్రజాప్రతినిధులంతా ఇందులో భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. యునానీ ఆస్పత్రిలో సమస్యలపై చర్చించామని… ఆస్పత్రిలో ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడిరచారు.