కరోనా వ్యాప్తి నేపథ్యంలో గాంధీ భవన్‌లో జాగ్రత్త చర్యలు చేపట్టారు. గాంధీ భవన్‌లో అన్ని గదులను శానిటేషన్ వేశారు. నాలుగు రోజుల వ్యవధిలోనే 10కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. సీఎల్పీ నేత భట్టి, శ్రీధర్‌బాబు, కోదండరెడ్డి, మహేశ్వర్‌రెడ్డికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. గాంధీభవన్ వ్యవహారాలు చూసే పలువురు మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ వున్నట్లు నిర్ధారించారు.