Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

కాంగ్రెస్‌ను వీడొద్దని జగ్గారెడ్డి కాళ్లు పట్టుకున్న బొల్లి కిషన్‌

కాంగ్రెస్‌ పార్టీని వీడొద్దని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పలువురు నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఉదయం కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు జగ్గారెడ్డిని కలిశారు. కాంగ్రెస్‌కు దూరం కావొద్దని జగ్గారెడ్డికి వీహెచ్‌ విజ్ఞప్తి చేశారు. పార్టీలోనే ఉంటూ అన్యాయాలపై కొట్లాడాలని సూచించారు. కార్యకర్తలతో మాట్లాడి తదుపరి నిర్ణయం వెల్లడిస్తానని జగ్గారెడ్డి ఈ సందర్భంగా వీహెచ్‌కు తెలిపారు. మరోవైపు పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్‌ జగ్గారెడ్డి కాళ్లు పట్టుకొని బతిమిలాడటం గమనార్హం. పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.అనంతరం జగ్డారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతానికైతే కాంగ్రెస్‌ పార్టీని వీడనని ఆయన స్పష్టంచేశారు. రాజీనామా చేయొద్దని పార్టీ అధిష్టానం కోరిందని చెప్పారు. మరోవైపు పార్టీలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు సోనియాగాంధీకి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. తన మీద సోషల్‌మీడియలో పోస్టులు చేస్తున్నట్లు..దీనిపై పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో తనపై, జగ్గారెడ్డిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వీహెచ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తమ ఫొటోలు మార్ఫింగ్‌ చేశారని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పని చేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసి దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేటట్లు కోరతానని వీహెచ్‌ చెప్పారు. ఈ సందర్భంగా వీహెచ్‌ జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు వీహెచ్‌ తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు కూడా దీనిపై ఫిర్యాదు చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img