మంత్రి హరీష్రావు
వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని, వారికి రైతుల గురుంచి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి హరీష్రావు మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో కొనుగోళ్ల కేంద్రాలెన్ని, టీఆర్ఎస్ హయాంలో కొనుగోలు కేంద్రాలెన్ని అని ప్రశ్నించారు. వడ్లు కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుద్ధ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. బాయిల్డ్ రైస్ విషయంలో పీయూష్ గోయల్ ఒకలా.., కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు మరోలా ఉంటున్నాయని, ఇద్దరిలో ఎవరిది కరెక్టు అనేది వారే తేల్చుకోవాలని అన్నారు. కేంద్రం తీరు వల్లే తడిసిన వడ్లు కొనలేకపోతున్నామని అన్నారు.