Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో కొత్త డ్రామాలు ఆడుతోంది: మంత్రి నిరంజన్‌ రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో కొత్త డ్రామాలు ఆడుతున్నదని మంత్రి నిరంజన్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణలోనే డిక్లరేషన్‌ చేస్త్తారా.. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో డిక్లరేషన్‌ చేయరా అని ప్రశ్నించారు. . హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డితో కలిసి మంత్రి నిరంజన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 75 ఏండ్ల కాలంలో రైతుబీమా గురించి ఏనాడైనా ఆలోచించారా అని రాహుల్‌ గాంధీని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధుతో రైతుల ఖాతాల్లో రూ.50 వేల కోట్లు జమ చేసిందన్నారు. 2017లో పంజాబ్‌ రైతులకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని, అందుకే అక్కడి ప్రజలు కాంగ్రెస్‌ను ఈడ్చి తన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img