Friday, September 30, 2022
Friday, September 30, 2022

కాంగ్రెస్‌, బీజేపీ నేతలను సిద్ధిపేట చెరువులో ముంచాలి : మంత్రి హరీశ్‌రావు

కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు సరఫరాపై విమర్శలు చేసే కాంగ్రెస్‌, బీజేపీ నేతలను సిద్దిపేట చెరువులో ముంచాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌ అయ్యారు. బుధవారం మంత్రి జిల్లాలోని నంగునూర్‌ మండలం రాజగోపాల్‌ పేట గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ చేపలను వదిలాం. కానీ గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చెరువులో నీళ్లు గుంజుకుపోయేవి. బోర్లు వేసి, మోటర్లు పెట్టి, ట్రాన్స్‌ఫార్మర్స్‌ పెట్టి చెరువులు నింపేవారమని నాటి రోజులను గుర్తు చేశారు. కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని కాలంతో పని లేకుండా.. సీఎం కేసీఆర్‌ దయతో నిండుగా ఉందన్నారు. దేశంలో రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చింది కేవలం సీఎం కేసీఆర్‌ ఒక్కడేనని మంత్రి హరీశ్‌ రావు వెల్లడిరచారు. ఒకప్పుడు యాసంగిలో నీళ్లు లేక, బోర్లు ఎండిపోయి, ట్రాన్స్‌ఫార్మర్స్‌ కాలిపోయేవి. ఇవాళ ఆ రోజులు మారిపోయి సీన్‌ రివర్స్‌ అయ్యిందని పేర్కొన్నారు. కానీ, బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు ఇదంతా కనపడటం లేదని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img