Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

కార్గో సేవలపై 25 శాతం డిస్కౌంట్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ

రంజాన్‌ మాసం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. కార్గో సేవలపై 25 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నట్టు తెలిపింది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ పదవీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించేందుకు పలు సంస్కరణలను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి పండుగ సందర్భంగా కొత్తకొత్త డిస్కౌంట్లను ప్రవేశపెడుతున్నారు. తాజాగా రంజాన్‌ సందర్భంగా కార్గో, పార్సిల్‌ ఛార్జీల్లో 25 శాతం రాయితీ ప్రకటించారు. ఈ సదుపాయం మే 3 వరకు అందుబాటులో ఉంటుందని సజ్జనార్‌ తెలిపారు. 5 కేజీల బరువు వరకు మాత్రమే ఈ డిస్కౌంట్‌ వర్తిస్తుందని తెలిపారు. ప్రయాణికులు మరిన్ని వివరాలకు 040-30102829, 68153333 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img