Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

కార్యకర్తలు సమన్వయంతో ఉండాలి : హరీశ్‌

మునుగోడు మండలం పలివెల గ్రామంలో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షోకి వెళ్తున్న సందర్భంగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై బీజేపీ గుండాలు రాళ్లదాడి చేశారు. మునుగోడులో మరికొన్ని గంటల్లో ఉప ఎన్నిక ప్రచార సమయం ముగుస్తున్న వేళ మంత్రి కేటీఆర్‌ రోడ్‌షోను అడ్డుకునేందుకే బీజేపీ కార్యకర్తలు రాళ్ల దాడి నిర్వహించారు. ఈ సంఘటన బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ సమక్షంలో ఈ దాడికి తెగబడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ఉండాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుస్తోందని అనే విషయంను జీర్ణించుకోలేకపోతున్న బీజేపీ కార్యకర్తలు ఇలాంటి దాడులు చేస్తారని మంత్రి అన్నారు. ఈ సందర్బంగా కార్యకర్తలు, నాయకులు ఎట్టి పరిస్థితుల్లో సమన్వయం కోల్పోవద్దన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img