Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌.. నలుగురికి చేరిన మృతుల సంఖ్య..

ఇంకా ఆస్పత్రుల్లో బాధితులు

రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ బాధితుల్లో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. చివరి రెండు రోజుల్లో ఇద్దరు మరణించగా.. ఇవాళ మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మొత్తం 34 మంది ఆపరేషన్‌ చేయించుకోగా.. నలుగురు మరణించారు. మిగతా 30 మందిలో ఏడుగురి ఆరోగ్యం బాగోలేక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సివిల్‌ హాస్పిటల్‌లో ఈ నెల 25వ తేదీన 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేశారు. 26, 27 తేదీల్లో ఆపరేషన్‌ చేయించుకున్న మహిళల్లో నలుగురు గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమస్యతో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారు. ఆదివారం సాయంత్రం ఒకరు, సోమవారం ఉదయం మరొకరు చనిపోగా.. ఇవాళ సీతారాంపేటకు చెందిన లావణ్య, కొలకులపల్లికి చెందిన మౌనిక అనే మరో ఇద్దరు మహిళలు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు సీరియస్‌ అయ్యారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడిరచారు. 30 మందిలో ఏడుగురి ఆరోగ్యం సరిగా లేదని.. వారిలో ఇద్దర్ని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వీరందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. మృతిచెందిన నలుగురు మహిళల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. గతేడాది 502 క్యాంపులు నిర్వహించామని ఎలాంటి పొరపాట్లు జరగలేదని.. ఈ సంవత్సరం కూడా డీపీల్‌ ట్రెయిన్‌ అయిన వైద్యలే ఆపరేషన్‌ చేశారని శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img