Friday, February 3, 2023
Friday, February 3, 2023

కుల గణన చేపట్టాలని టీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం

కుల గణన చేపట్టాలంటూ పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఇవాళ టీఆర్‌ఎస్‌ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర రావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. కుల గణన చేపట్టాలని ఆయన కోరారు. ఇక రాజ్యసభలోనూ టీఆర్‌ఎస్‌ ఎంపీ కే కేశవ రావు ఇదే అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చారు. కుల గణన అంశంపై చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి కుల గణన అంశం పెండిరగ్‌లో ఉందని ఎంపీ నామా అన్నారు. గతంలో ఈ అంశంపై ప్రభుత్వం హామీ ఇచ్చిందని, దేశ ప్రయోజనం కోసం కుల గణన చేపట్టాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img