Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

కూసుమంచి మండలంలో వైఎస్సార్‌ విగ్రహం కూల్చివేత..తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని కూల్చివేశారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ విగ్రహాలను కూల్చిన పిరికిపందల్లారా ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. ప్రజల్లో ముఖం చెల్లక, ప్రజలు మిమ్మల్ని చీదరించుకుంటున్నారన్న అసహనంతో వైఎస్సార్‌ విగ్రహాలను కూల్చుతున్నారా? అంటూ నిలదీశారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి వస్తున్న ఆదరణను తట్టుకోలేక, మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని దౌర్భాగ్యుల్లారా అంటూ మండిపడ్డారు. విగ్రహాలు కూల్చినంత మాత్రాన జనం గుండెల్లో కొలువైన వైఎస్సార్‌ స్థానాన్ని ఎవరూ కూల్చలేరని షర్మిల స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో వైఎస్సార్‌ విగ్రహాన్ని కూల్చివేసిన వెధవలను వెంటనే అరెస్ట్‌ చేసి చట్టప్రకారం శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ చర్యలకు పాల్పడిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img