Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

కృష్ణా జలాలపై ఏపీ దాదాగిరీ చేస్తోంది.. : సీఎం కేసీఆర్‌

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పందించారు. సోమవారం నాడు నాగార్జున సాగర్‌లో పర్యటించిన ఆయన.. హాలియాలో నిర్వహించిన సభలో మాట్లాడారు. కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతామని చెప్పారు. దేవరకొండలో ఐదు లిఫ్టులు, మిర్యాలగూడలో ఐదు లిఫ్టులు, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌లో ఒక్కొక్క లిఫ్ట్‌ ఇలా నల్గొండ జిల్లాలో మొత్తం 15 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పెద్దదేవులపల్లి చెరువు వరకు పాలేరు రిజర్వాయర్‌ నుంచి గోదావరి నీళ్లను తెచ్చి అనుసంధానం చేయాలనే సర్వే జరుగుతోంది. అది పూర్తయితే నాగార్జున సాగర్‌ ఆయకట్టు చాలా సేఫ్‌ అయ్యే అవకాశం ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img