Friday, March 31, 2023
Friday, March 31, 2023

కేంద్రం మెడలు వంచి కొనిపించండి

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల
దిల్లీ కోటలు బద్దలు కొడుతాం, మోదీని తరిమేస్తాం అని చెప్పుకొనే కేసీఆర్‌ రైతుల వడ్లు కేంద్రం చేత కొనిపించడం చాతకాదా?. మీవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలేనా? అని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. రైతు చస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయాలు మాత్రమే కావాలని… రైతు బతుకు గురించి మాత్రం సోయి లేదని విమర్శించారు. ‘రాష్ట్రంలో చివరి గింజ వరకు కొంటాం, అని మొన్నటి వరకు చెప్పుకొన్న కేసీఆర్‌… కేంద్రంతో పంచాయితీ మొదలవ్వగానే యాసంగి కిరికిరి మొదలు పెట్టారు. కేంద్రం కొననంటుంది.. అందుకే మేము కొనటం లేదని నాటకాలాడుతున్నరు.’ అని అన్నారు. మీకు దమ్ముంటే రాష్ట్రంలో పండిన ప్రతి గింజ కొనండి. కేంద్రం మెడలు వంచి కొనిపించండి అంటూ షర్మిల వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img