Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

కేసీఆర్‌ తెలంగాణలో ఏం చేశారని పక్క రాష్ట్రాలకు పోతారు : షర్మిల

కేసీఆర్‌ దేశాన్ని ఏలుతారంటే అందరూ ఆత్మహత్యలు చేసుకోవాలని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ తెలంగాణలో ఏం చేశారని పక్క రాష్ట్రాలకు పోతారని పేర్కొన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కూడా ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయానికి ఉన్న అన్ని రకాల సబ్సిడీలను తీసేశారని.. రైతులపై కేసీఆర్‌కు ఎందుకింత వివక్ష అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వయసుకు పరిమితం లేకుండా రైతులకు భీమా వర్తింపజేయాలన్నారు. యూపీలో కేసీఆర్‌ ప్రచారం అనేది పెద్ద జోక్‌గా అభివర్ణించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img