Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

కేసీఆర్‌ నాయకత్వంలో అగ్రగామిగా తెలంగాణ


: మంత్రి కేటీఆర్‌
తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఏడేళ్లకాలంలో కేసీఆర్‌ నాయకత్వంలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెర్వు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్‌ యూనివర్సిటీలో జరుగుతున్న ‘కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ’ ఓరియంటేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏడేళ్లుగా సవాళ్లను అధిగమించి పని చేస్తున్నామన్నారు. రైతుబంధు పథకం అమలు చేసిన సమయంలో అనుమానాలు వ్యక్తం చేశారని, ఇప్పుడు 11 రాష్ట్రాలు పథకం పేరు మార్చి అమలు చేస్తున్నాయన్నారు. 24 గంటల నాణ్యమైన, అంతరాయం లేని కరెంటు అన్ని రంగాలకు అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img