మంత్రి నిరంజన్ రెడ్డి
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.మంగళవారంవనపర్తిలో సంత్ సేవాలాల్ మహరాజ్ 283వ జయంతి వేడుకల్లో పాలొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో తండాలను గిరిజనులే అభివృద్ధి చేసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ సహకారంతో గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నారని చెప్పారు. సంత్ సేవాలాల్ మార్గం అనుసరణీయమని, బంజారాలకు ఆయన అందించిన సేవలు మరవలేనివన్నారు. వనపర్తి జిల్లాలో ఎంబీబీఎస్, ఐఐటీల్లో సీట్లు సాధించిన గిరిజన విద్యార్థులకు సన్మానం చేశారు. వనపర్తి గిరిజన భవన్ కు అర ఎకరా స్థలం కేటాయించారు.