Monday, January 30, 2023
Monday, January 30, 2023

కేసీఆర్‌ పోరాటానికి మా మద్దతు.. కేరళ సీఎం పినరయి విజయన్‌

కేసీఆర్‌ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని కేరళ సీఎం పినరయి విజయన్‌ అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ సభలో ఆయన మాట్లాడుతూ..ఫెడరల్‌ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ వ్యవహరిస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకే కేసీఆర్‌ పోరాటానికి మద్దతిస్తున్నామన్నారు. ఈ సభ దేశానికి దిక్సూచి లాంటిదన్నారు. రాష్ట్రాల హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. దేశంలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి ఉందన్నారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. గవర్నర్ల వ్యవస్థను కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్నారు. తెలంగాణ పోరాటాల గడ్డ అన్నారు. ఇక్కడి సంక్షేమ పథకాలు కేరళలోనూ అమలు చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img