Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

కొత్తగా 767 మందికి కరోనా కేసులు


తెలంగాణలో కరోనా కేసులు కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టినా..మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 1,18,778 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 767 కరోనా కేసులు నమోదయ్యాయి.తాజాగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,33,146కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3738కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 848 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,19,344కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,064 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 97.82 శాతానికి పెరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img