Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

కొత్త జిల్లాలు ఏర్పాటుతో ప్రజలకు అందుబాటులో అధికారులు : మంత్రి సత్యవతి

కొత్త జిల్లాలు ఏర్పడటం ద్వారా అధికారులు అంతా ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రూ. 102 కోట్లతో చేపట్టిన పలు పనులకు మంత్రి హరీశ్‌రావుతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. మా తండాలు మేం పాలించుకోవాలి అంటే గిరిజనుల కోరికను ఎవరూ పట్టించుకోలేదు. కాని సీఎం కేసీఆర్‌ 3,146 గ్రామ పంచాయతీలుగా చేసి 75 ఏళ్ల గిరిజనుల కలను నెరవేర్చారని అన్నారు. సర్పంచులు చేయడమే కాకుండా ఆత్మగౌరవంతో తామే పాలించుకునేలా చేశారు. 12 వేల 56 కోట్లు గిరిజన సంక్షేమం కోసం మంత్రి హరీశ్‌ రావు ఆధ్వర్యంలో బడ్జెట్‌ లో పెట్టించకోగలిగామన్నారు. అంతే కాదు గిరిజన గ్రామ పంచాయతీలకు పరిపాలన భవనాలు నిర్మించుకోనున్నాం అని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img