Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

కొనసాగుతున్న బంగారు వ్యాపారుల సమ్మె

దేశవ్యాప్తంగా బంగారు వ్యాపారుల సమ్మె కొనసాగుతోంది. బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ వేయాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బంద్‌ను పాటిస్తున్నాయి. సింబాలిక్‌ స్ట్రైక్‌లో భాగంగా ఇవాళ ఒకరోజు దుకాణాలను మూసిఉంచారు. ఆలిండియా జెమ్‌ అండ్‌ జ్యువెలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ (జీజేసీ) ఆధ్వర్యంలో ఈ బంద్‌ను పాటిస్తున్నాయి. తెలంగాణలోని దాదాపు 55,000 జెమ్‌, గోల్డ్‌ జ్యువెలరీ ట్రేడర్స్‌ తమ వ్యాపారాలను నిలిపివేశారు.బషీర్‌బాగ్‌ వద్ద నగల వ్యాపారులు ఆందోళనకు దిగారు. హాల్‌ మార్క్‌లో కొత్త నిబంధనలపై వ్యాపారుల నిరసన చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img