Friday, February 3, 2023
Friday, February 3, 2023

కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలి

సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ
పెండిరగ్‌ కేసుల సత్వర విచారణ జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉన్నదని పేర్కొన్నారు. సంప్రదింపుల ద్వారా సమస్యలు కొలిక్కి తేవచ్చని వెల్లడిరచారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) సదస్సులో సీఎం కేసీఆర్‌తో కలిసి సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోర్టులకు వచ్చేముందే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ సమయంలో పరిష్కారాలు లభిస్తాయని చెప్పారు. పెండిరగ్‌ కేసుల సత్వర విచారణ జరగాలన్నారు.మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉన్నదని పేర్కొన్నారు. సంప్రదింపుల ద్వారా సమస్యలు కొలిక్కి తేవచ్చని వెల్లడిరచారు. ఆస్తుల పంపకాలను కుటుంబ సభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. సాధ్యమైనంతవరకు మహిళలు మధ్యవర్తిత్వంలో వివాదాలు పరిష్కరించుకోవాన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు హైదరాబాద్‌ సరైన వేదిక అని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img