Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ కు మరోసారి ఈడీ నోటీసులు

క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ కు ఎన్స్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15న తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవల థాయ్ లాండ్ లో చికోటి ప్రవీణ్ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం నేపథ్యంలో ఆయనకు మరోసారి ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారంటూ ఈడీ కేసు నమోదు చేసింది. ప్రవీణ్ తో పాటు సంపత్, మాధవరెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు పంపింది. గతంలో కూడా ప్రవీణ్ ను ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img