Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

గంగపుత్రుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు

: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు
రాష్ట్రంలో గంగపుత్రుల అభివృద్ధికి సంక్షేమానికి ఎన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. అన్నారు. సీఎం కేసీఆర్‌ అన్ని కులాల వారికి పలు రకాల పథకాలు అమలుచేస్తూ వారి ఉన్నతికి పాటు పడుతున్నారని, గంగపుత్రుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు. శుక్రవారం హన్మకొండలోని మినిస్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో వరంగల్‌ జిల్లా గంగపుత్ర (బెస్త) పరస్పర సహాయ సహకార గృహనిర్మాణ సంఘం 2022 సంవత్సరపు డైరీని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గంగపుత్రుల అభివృద్ధికి సంక్షేమానికి ఎన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, ఈ పథకాలు నిరుపేద గంగపుత్రులు వినియోగించుకునే విధంగా కృషి చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img