Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

గణేశ్‌ శోభాయాత్రకు అంతా సిద్ధం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు, రూట్‌ మ్యాప్‌ ఇదే

ఖైరతాబాద్‌ మహాగణపతి తర్వాత అంతటి ప్రసిద్ధి చెందిన బాలాపూర్‌ గణేశుడి విగ్రహాన్ని సాగర్‌లో నిమజ్జనం చేయబోతున్నట్లు రాచకొండ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఈ గణనాథుడు సాగరానికి చేరేందుకు వీలుగా మార్గం రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ప్రధాన శోభాయాత్ర జరిగే మార్గాన్ని హైదరాబాద్‌ పోలీసులు విడుదల చేశారు. ట్రాఫిక్‌ ఇబ్బందుల్లేకుండా ఊరేగింపు మార్గాలు, ఇతర వాహనాలు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా మార్గాల్లో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం10 గంటల వరకు ఇతర వాహనాలను అనుమతించబోమని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రకటించారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన లారీలను శుక్రవారం ఉదయం నుంచి 24 గంటలు నగరంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
పార్కింగ్‌ ప్రదేశాలు
ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌, స్టేషన్‌, ఆనంద్‌నగర్‌ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయం వరకు, బుద్ధ భవన్‌ వెనుక వైపు, గో సేవా సదన్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్ట మైసమ్మ గుడి, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, నిజాం కాలేజ్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌, ఐమాక్స్‌ పక్కన.
ట్యాంక్‌బండ్‌లో గణేశ్‌ నిమజ్జనానికి సంబంధించిన హైదరాబాద్‌ పోలీసులు రూట్‌ మ్యాప్‌ను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు విడుదల చేశారు. విగ్రహాలను ఏయే మార్గాల్లో ట్యాంక్‌బండ్‌కు తీసుకురావాలన్న దానిపై స్పష్టత ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img