Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

గర్భిణిలు ఐరన్‌ మాత్రలు వేసుకోవాలి : గవర్నర్‌ తమిళిసై

గర్భిణిలు ఐరన్‌ మాత్రలు వేసుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌ దవాఖానలో 2021- 2022 బ్యాచ్‌ విద్యార్థులు కోర్సులో చేరుతున్న సందర్భంగా నిర్వహించిన వైట్‌కోట్‌ వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఐరన్‌ మాత్రలపై గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. పిల్లలు నల్లగా పుడతారని ఐరన్‌ మందులను వేసుకోకుండా పడేస్తున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందుబాటులోకి రావాలన్నారు. వైద్య వృత్తిని ఆస్వాదిస్తూ నేర్చుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img