ప్రధాని మోదీతో సమావేశం అనంతరం గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ పదవుల పట్ల తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని అన్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ,ప్రోటోకాల్ విషయంలో లోపాలపై ఎప్పుడు స్పందించని గవర్నర్ ఇప్పుడెందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు. తమిళిసై గవర్నర్ పదవిలో వస్తే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ గవర్నర్ పదవిని అడ్డం పెట్టుకుని బీజేపీ నాయకురాలిగా వస్తే మాత్రమే సమస్య అని మంత్రి స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించామని తెలిపారు. తమ వైపు నుంచి గవర్నర్కు ఎలాంటి సమస్య లేదు. గత గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు రాని సమస్య ఇప్పుడెందుకు వస్తుందని ప్రశ్నించారు.