Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గురుకులాలు తెరవద్దన్న గత ఆదేశాలను హైకోర్టు సవరించింది. విద్యా సంస్థల్లో కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకున్నామని ఏజీ తెలిపారు. రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలు తెరిచేందుకు గతంలో హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ, గురుకుల విద్యాలయాల ప్రారంభానికి అనుమతి ఇవ్వలేదు. తాము ఆదేశాలు జారీ చేసే వరకు గురుకులాలను తెరవొద్దని కోర్టు ఆదేశించింది. ఇంటర్‌ పరీక్షల దృష్ట్యా గురుకులాలను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో.. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img