Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

గోనె ప్రకాశరావుపై ఉద్యోగుల సంఘాల మండిపాటు

ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోనె ప్రకాశరావుపై ఐఏఎస్‌ అసోసియేషన్‌ మండిపడిరది.ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచింది. ఆయన వ్యాఖ్యలు కలెక్టర్‌ వ్యవస్థ విలువను తగ్గించడమే కాకుండా మహిళా అధికారి గౌరవాన్ని కించపరిచేలా ఉందని విరుచుకుపడిరది. మహిళా అధికారికి వ్యతిరేకంగా ఈ అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు చట్టం ప్రకారం అవసరమైన చర్యను ప్రారంభించాలని అసోసియేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ని అభ్యర్థించింది.ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో ఉద్యోగులు నిబద్ధతతో పని చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు అన్నారు. ప్రకాశరావు ప్రధానంగా ఓ మహిళా కలెక్టర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని అభ్యంతరం వ్యక్తంచేశారు. ఉద్యోగుల జేఏసీ తరుపున ఇలాంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img