: మంత్రి తలసాని
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అన్ని జిల్లాల పశువైద్యాధికారులు, పశుసంవర్థక అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పశుసంవర్థక శాఖకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారని మంత్రి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీతో రూ.6500 కోట్ల సంపద సృష్టించబడిరదని వెల్లడిరచారు. 2వ విడత గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.దశల వారీగా పశు వైద్యశాలల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.