Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

గ్రేటర్‌లో 41.4 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

రెండ్రోజులుగా పెరిగిన ఎండలకు నగరవాసులు అల్లాడిపోతున్నారు. బుధవారం మాదాపూర్‌లో అత్యధికంగా 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బాలాజీనగర్‌, మైత్రీవనంలో, తిరుమలగిరి, అడ్డగుట్టలో 41.3, మౌలాలిలో 41.1, ప్రశాంత్‌నగర్‌, శ్రీనగర్‌కాలనీ, జుమ్మెరాత్‌ బజార్‌లో 40.9, మచ్చబొల్లారం, అల్కాపురి కామన్‌హాల్‌లో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండుతుండడంతో జనం బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img