Monday, August 15, 2022
Monday, August 15, 2022

చంచల్‌గూడ జైల్‌లో ములాఖత్‌కు రాహుల్‌కు అనుమతి నిరాకరణ

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి తెలంగాణలోని చంచల్‌గూడ జైల్‌లో ములాఖత్‌కు అనుమతి లభించలేదు జైల్లో ఎన్‌ఎస్‌యూఐ నేతలను కలిసేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అనుమతి కోరారు. అందుకు జైలు సూపరింటెండెంట్‌ నిరాకరించారు. కాగా ఇప్పటికే రాహుల్‌ ఓయూలో పర్యటించేందుకు వీసీ అనుమతించలేదు. దీనిపై నిరసన తెలుపుతూ ఎన్‌ఎస్‌యూఐ నేతలు నిరసనకు దిగారు. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైల్లో వారితో ములాఖత్‌ అయ్యేందుకు రాహుల్‌ను అనుమతించాలంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు జైలు సూపరింటెండెంట్‌కు వినతి పత్రం సమర్పించారు. అందుకు ఆయన నిరాకరించారు.మరోవైపు వరంగల్‌లో జరగనున్న రాహుల్‌ గాంధీ సభకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పాల్గొనడంలేదు. ఆరోగ్య సమస్యలతో రాహుల్‌ రైతు సంఘర్షణ సభకు గైర్హాజరవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాదులోనే ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి. చాలా రోజులుగా కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img