Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

చార్మినార్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి.. భారీగా బలగాల మోహరింపు

నుపుర్‌ వ్యాఖ్యలకు నిరసనగా చార్మినార్‌ వద్ద ముస్లింల ఆందోళనలు
మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులు నుపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ను అరెస్టు చేయాలని హైదరాబాద్‌లోని ముస్లింలు డిమాండ్‌ చేశారు. మక్కామసీదులో ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లింలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మక్కామసీదు నుంచి మొఘల్‌ పురా ఫైర్‌ స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. నుపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ను అరెస్టు చేయాలని ముస్లింలు నినదించారు. చార్మినార్‌, మక్కామసీదు, కాలపత్తార్‌, మెహిదీపట్నం, చాంద్రాయణగుట్ట, షాహీన్‌నగర్‌, సైదాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ముస్లింలు నిరసనలు వ్యక్తం చేశారు. ముస్లింల నిరసనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పాతబస్తీలో పోలీసులు భారీగా మోహరించారు. చార్మినార్‌ వద్ద పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తును పర్యవేక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img