Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి

: మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
సినిమా షూటింగ్‌ల కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. నగరంలోని బీఆర్‌కేఆర్‌ భవన్‌లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి తలసాని అధ్యక్షతన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్‌ను ఫిల్మ్‌ హబ్‌గా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాన లక్ష్యమని అన్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. 5వ ఆట ప్రదర్శనకు కూడా అనుమతించడం జరిగిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img