Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

చిరు వ్యాపారుల కోసం స్ట్రీట్‌ వెండిరగ్‌ జోన్స్‌ ఏర్పాటు

మంత్రి కేటీఆర్‌
చిరు వ్యాపారుల కోసం స్ట్రీట్‌ వెండిరగ్‌ జోన్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.శాసనసభలో పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం మంత్రి వివరణ ఇచ్చారు. రూ. 500 కోట్లతో ప్రతి మున్సిపాలిటీలో రెండు ఎకరాలకు తగ్గకుండా వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. యువకుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్‌లో 74, మున్సిపాలిటీల్లో 369 ఓపెన్‌ జిమ్స్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. రూ. 850 కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. పేదవారికి రూపాయికే నల్లా కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. . ఈ మూడేండ్లలో ప్రభుత్వం 141 పట్టణాల్లో 1602 నర్సరీలు ఏర్పాటు చేసిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img