Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

చెన్నూరు నుంచి మళ్లీ నేనే పోటీచేస్తా : బాల్క సుమన్

చెన్నూరు నియోజకవర్గం నుంచి మళ్లీ నేనే పోటీ చేస్తానని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ అన్నారు. మంగళవారం స్థానిక సంతోషి మాతా ఫక్షన్ హాల్ లో చెన్నూరు మండల బీఆర్ఎస్ పార్టీ మండల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యకరమానికి హాజరైన సుమన్ పార్టీ శ్రేణులకు దిశనిర్దేశం చేశారు. 60 ఏళ్ల విపక్ష పార్టీలు నియోజక వర్గ ప్రజలను వివిధ కుంటి సాకులతో మోసం చేశారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ముఖ్య మంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. రానున్న రోజుల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లి రాష్ట్రంలో నెంబర్ వన్ నియోజకవర్గంగా మారుస్తామన్నారు. కేసీఆర్ అందిస్తున్న పథకాలు గడపగడపకు అందుతున్నాయన్నారు. అది మింగుడు పడని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగేలా కృషి చేస్తామన్నారు. ఈ సమ్మేళనంలో ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, జడ్పీ చెర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img