Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

జగిత్యాల జిల్లాలో బీజేపీ ఎంపీ అరవింద్‌కు చేదు అనుభవం

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు చేదు అనుభవం ఎదురైంది. గోదావరి ముంపును పరిశీలించడానికి వెళ్లిన ఎంపీని గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామానికి సంబంధించిన భూ వివాదం పరిష్కరించకుండా ఎందుకు వచ్చారంటూ ఆయనను నిలదీశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.పోలీసులు గ్రామస్థులను పక్కకు తప్పించగా.. ఎంపీ అరవింద్‌ గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లారు. మరోసారి గ్రామస్తులు అడ్డుకోవడంతో తిరుగుపయమయ్యారు అరవింద్‌. అయినా వారు అడ్డుకున్నారు. కాన్వాయ్‌ కు అడ్డువచ్చిన గ్రామస్తులను పోలీసులు తప్పించి అరవింద్‌ కాన్వాయ్‌ను ముందుకు పంపించారు.దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఎంపీ కాన్వాయ్‌ పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో రెండు వాహనాల అద్ధాలు ధ్వంసమయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img