Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

జనం చస్తే మీకెందుకు.. మీకు మీ రాజకీయాలే ముఖ్యం

సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ షర్మిల విమర్శలు

మూసీ ఉప్పొంగి భాగ్యనగరంలోని అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. మూసీ ఉప్పొంగడంపై ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వైఎస్‌ షర్మిల విమర్శలు గుప్పించారు. ఓవైపు వర్షాలతో మూసీ ఉప్పొంగి పరివాహక ప్రాంతాలు మునిగిపోతున్నా.. ఏటా వర్షాలకు ఇదే పరిస్థితి ఉన్నా.. ముందస్తు చర్యలు ఉండవని ఆరోపించారు. వరదలు వచ్చినప్పుడు.. జనం కొట్టుకుపోయి చచ్చినప్పుడే మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు తొలగిస్తాం అని చెప్తారని మండిపడ్డారు. అక్రమ కట్టడాలపై ప్రకటనలే కానీ.. చేతలు మాత్రం ఉండవని విమర్శించారు. వర్షాలు వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే.. సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిన సీఎం కేసీఆర్‌ ఢల్లీిలో రాజకీయాలు చేస్తున్నారని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో వరదలు వచ్చి ఇండ్లు మునిగిపోతే మీకెందుకు.. జనం చస్తే మీకెందుకు.. మీకు మీ రాజకీయాలే ముఖ్యం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img