Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటి స్థలాల హామీని నిలబెట్టుకోవాలని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని, పేదవాళ్ళకు 100 గజాల ఇళ్ల స్థలం ఇచ్చే జీవో మళ్ళీ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటి స్థలాల హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు నిధులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముభరక్‌ సహాయం రూ.రెండు లక్షలు పెంచాలన్నారు. ఈ స్కీంకు మరో రెండు లక్షలు అదనంగా ఇవ్వాలని కోరారు. క్యాన్సర్‌ రోగుల సమస్యలపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని, వైద్యం కోసం ఆ కుటుంబాలు అప్పుల పాలు అవుతున్నాయన్నారు. యాదాద్రికి మెట్రో రైల్‌ ఏర్పాటు చేయాలని, అలాగే సంగారెడ్డికి కూడా మెట్రోను విస్తరించాలన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ భృతి రూ.3016 ఇస్తామన్నారు.. ఆ అంశం గవర్నర్‌ ప్రసంగంలో రాలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img