Friday, March 31, 2023
Friday, March 31, 2023

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌లోని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)జోనల్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. కార్యాలయం మూడో అంతస్తులోని పన్నుల విభాగంలో మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న ఫైల్స్‌ పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన స్థలానికి అగ్ని మాపక , డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితోపాటు మూడు ఫైర్‌ ఇంజన్లు చేరుకున్నాయి. వెంటే మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆఫీసులో పని చేస్తున్న సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు.పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో ఉద్యోగులు కాసేపు ఆందోళనకు గురయ్యారు.ఐదో అంతస్తులో పలువురు చిక్కుకున్నారు. వారంతా భయంతో కార్యాలయం టెర్రస్‌ పైకి పరుగులు తీశారు. మంటలు అదుపులోకి రావడంతో క్రేన్‌ సహాయంతో కిందికి దిగారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img