Monday, September 26, 2022
Monday, September 26, 2022

జూరాల వద్ద నిర్మించే పార్కుకు కేటీఆర్‌ శంకుస్థాపన

గద్వాల జిల్లాలో ధరూర్‌ మండలం జూరాల ప్రాజెక్టు వద్ద సందర్శకుల సౌకర్యార్థం రూ. 15 కోట్లతో నిర్మించే పార్కుకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. పర్యటనలో భాగంగాపార్కుకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.దీనికి ముందు అలంపూర్‌ చౌరస్తాలోని మార్కెట్‌ యార్డు ఆవరణలో 100 పడకల ఆస్పత్రికి ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌ రెడ్డి, అబ్రహం, ఎంపీ రాములు, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, సురభి వాణీదేవితో పాటు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్‌ యార్డు ఆవరణలో 3:15కు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. 4:15కు సభ ముగియగానే అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు మంత్రి కేటీఆర్‌ బయలుదేరనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img