Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ ఖారారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించడంతో పేర్లను ప్రకటించారు. శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, బండ ప్రకాశ్‌, కౌశిక్‌రెడ్డి, సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌లకు అభ్యర్థులుగా అవకాశం కల్పించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఈరోజు నామినేషన్ల దాఖలు చేయనున్నారు. ఈ ఆరుస్థానాల్లోనూ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఎమ్మెల్సీ పదవుల కోసం టీఆర్‌ఎస్‌లో తీవ్రమైన పోటీ నెలకొనడంతో సోమవారం ఉదయం నుంచి ఆశావహుల పేర్లపై సీఎం కేసీఆర్‌ సహా టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు సుదీర్ఘ మంతనాలు జరిపారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్‌ను అనూహ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని భావించినా, చివరికి ఎమ్మెల్యే కోటా కింద ఆయన్ను పరిగణనలోకి తీసుకుని ఎంపికచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img