Friday, February 3, 2023
Friday, February 3, 2023

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ మెడలు వంచేది బీజేపీ మాత్రమే

: బండి సంజయ్‌
టీఆర్‌ఎస్‌ సర్కార్‌ మెడలు వంచేది బీజేపీ మాత్రమేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీకి పేరు వస్తుందనే ప్రధాని ఆవాస్‌ యోజన పథకం పేరు మార్చారని ఆరోపించారు. మూడో రోజు సోమవారం ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సందర్భంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ప్రధాని ఆవాస్‌ యోజన పథకం పేరు మార్చారని, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లంటూ పేరు మార్చుకున్నారని అన్నారు. కాంట్రాక్టర్ల కోసమే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ళు కడుతున్నారని, ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదని విమర్శించారు. ఇప్పటివరకు కేంద్రానికి లబ్ధిదారుల జాబితా అందించలేదని, కేంద్రం ఎన్నిసార్లు అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను మాత్రం ప్రభుత్వం చక్కగా వాడుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లిన ప్రజలు సమస్యలు చెబుతున్నారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img