Monday, June 5, 2023
Monday, June 5, 2023

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్, అతడి తమ్ముడు రవికుమార్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితుడైన డాక్యా నాయక్‌ నుంచి ఏఈ పేపర్‌ను భగవంత్ తన తమ్ముడి కోసం కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వారిని అరెస్టు చేశారు. డాక్యా నాయక్ బ్యాంకు ఖాతాలను పరిశీలించగా భగవంత్ రూ. 2 లక్షలు పెట్టి పేపర్ కొనుగోలు చేసినట్టు బయటపడింది. కాగా, పేపర్ లీక్ నిందితులకు రూ.33.4 లక్షల మేర అందినట్టు ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తులో తేలింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img