Friday, February 3, 2023
Friday, February 3, 2023

టెన్త్‌ విద్యార్థినిపై హత్యాచారం కేసు..ప్రియుడే హంతకుడు

వికారాబాద్‌ జిల్లాలో సంచలనం రేపిన టెన్త్‌ విద్యార్థిని అత్యాచారం, హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కేసు వివరాలను పరిగిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడిరచారు. ఈనెల 28న అంగడి చిట్టెంపల్లిలో మైనర్‌ బాలికపై అత్యాచారం హత్య చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందిందన్నారు. దీని కోసం పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 48 గంటల్లో నిందితుడిని గుర్తించామన్నారు. మహేందర్‌ అనే వ్యక్తి నేరానికి పాల్పడ్డాడని, హత్య చేసినట్టు అతను ఒప్పుకున్నాడన్నారు. ఇద్దరి మధ్య ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ఈ ప్రేమ వ్యవహారం బాలిక హత్యకు రెండు రోజుల ముందు మృతురాలి చెల్లెలకు తెలిసిందని, ఈ విషయం ఆమె ఇంట్లో చెప్పడంతో తల్లి మందలించిందన్నారు. ఇక బయట కలుసుకోవడం కుదరదని భావించి హత్యకు ముందు రోజు ఫోన్‌ చేసి ఇద్దరం బయట కలుద్దాం అని మాట్లాడుకున్నారని, అనుకున్న విధంగా బాలిక తెల్లవారుజాము మూడు, నాలుగు గంటల ప్రాంతంలో బయటకు వచ్చిందన్నారు. తనతో ఫిజికల్‌గా కలవాలని మహేందర్‌ ఆమెను బలవంత పెట్టగా.. బాలిక గట్టిగా ప్రతిఘటించిందని, దీంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిందని, ఈ నేపథ్యంలో బాలికను మహేందర్‌ తోయడంతో ఆమె తల పక్కనే ఉన్న చెట్టుకు బలంగా తాకిందని, దీంతో బాలిక స్పృహ కోల్పోయిందన్నారు. అది గమనించకుండా మహేందర్‌ ఆమెపై హత్యాచారం చేశాడని, అనంతరం బాలికను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడని తెలిపారు. నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడని, ఇవాళ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్ట్‌ ద్వారా త్వరితగతిన మహేందర్‌కు శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img