Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ట్రాఫిక్‌ హోంగార్డును అభినందించిన హైకోర్టు సీజే..

తన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్న ఓ ట్రాఫిక్‌ హోంగార్డ్‌ను హైకోర్టు సీజే సతీశ్‌ చంద్ర శర్మ. అభినందించారు. హోగార్డుకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళితే, చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ ప్రతి రోజు తన అధికారిక నివాసం నుంచి హైకోర్టుకు అబిడ్స్‌ మీదుగా వెళ్తుంటారు. అబిడ్స్‌లోని బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహం వద్ద ట్రాఫిక్‌ హోంగార్డ్‌ అష్రఫ్‌ అలీ(5066, అబిడ్స్‌ పీఎస్‌) విధులు నిర్వర్తిస్తుంటాడు. అష్రఫ్‌ తన విధులను చిత్తశుద్ధితో నిర్వహించడాన్ని చీఫ్‌ జస్టిస్‌ ప్రతి రోజు గమనించేవారు. ఈ క్రమంలో అతని పనితీరు పట్ల ఆకర్షితులైన సీజే సతీశ్‌ చంద్ర శర్మ.. శుక్రవారం ఉదయం తన కాన్వాయ్‌ను బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహం వద్ద ఆపారు. హోంగార్డ్‌ అష్రఫ్‌ అలీకి పుష్పగుచ్ఛం అందించి, అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img